సెన్సేష‌న్‌..5 రోజులు..30 కోట్లు

Geetha Govindam Crosses Rs. 30 Cr in 5 Days
Monday, August 20, 2018 - 16:00

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన "గీత గోవిందం" మినీ సునామీ సృష్టించింది క‌లెక్ష‌న్ల ప‌రంగా. కేవ‌లం ఐదు రోజుల్లోనే 31 కోట్ల రూపాయ‌ల షేర్‌ని పొందింది. మూములుగా ఇలాంటి సంఖ్య‌ల‌ను కేవ‌లం పెద్ద హీరోల సినిమాల విష‌యంలోనే వింటూ ఉంటాం. విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి మిడిల్ రేంజ్ హీరోకి ఈ రేంజ్ క‌లెక్ష‌న్ల‌ను ఎపుడూ చూడ‌లేదు, విన‌లేదు. అందుకే దీన్ని మినీ సునామీ అంటున్నారు. ఒక‌వైపు, తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. మ‌రోవైపు, థియేట‌ర్ల‌లో క‌న‌క‌వ‌ర్షం కురుస్తోంది.

నైజాం - 8.65 Cr
సీడెడ్ - 3.35 Cr
వైజాగ్ -  2.20 Cr
గుంటూరు - 1.80 Cr
ఈస్ట్ గోదావ‌రి -1.86 Cr
వెస్ట్ గోదావ‌రి - 1.50 Cr
కృష్ణా - 1.72 Cr
నెల్లూరు - 0.68 Cr
క‌ర్ణాట‌క -  2.30 Cr
త‌మిళ‌నాడు  0.70 Cr
అమెరికా - 5.95 Cr
ఆస్ట్రేలియా: 0.50 Cr
ఇత‌ర ప్రాంతాలు: 1.00 Cr

5 రోజుల‌కి షేర్ - రూ. 31.20 కోట్లు