జెమిని చెంతకు చేరిన నాని సినిమా

Gemini bags Nani's V
Saturday, October 19, 2019 - 10:15

"గ్యాంగ్ లీడర్" కంప్లీట్ అయిన వెంటనే దిల్ రాజు నిర్మిస్తున్న "V" సినిమా సెట్స్ పైకి చేరిపోయాడు నాని. కెరీర్ లో నానికి ఇది 25వ సినిమా కావడం విశేషం. పైగా తన ఫేవరెట్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా. వీటన్నింటికీ తోడు ఇది మల్టీస్టారర్ సినిమా. అందుకే ఈ సినిమాపై ఛానెళ్లపై దృష్టిపెట్టాయి. అలా భారీ పోటీ మధ్య జెమినీ ఛానెల్.. ఈ సినిమా శాటిలైట్ హక్కులు దక్కించుకుంది.

రీసెంట్ గా వచ్చిన నాని సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వలేకపోయాయి. జెర్సీ సినిమాను విమర్శకులంతా మెచ్చుకున్నారు కానీ అది కేవలం ఒక  గానే మిగిలింది. తాజాగా వచ్చిన గ్యాంగ్ లీడర్ బ్రేక్ ఈవెన్ వరకు వచ్చినట్లు ఉంది. సో.. ఇప్పుడు తన హోప్స్ అన్నీ V సినిమాపైనే పెట్టుకున్నాడు నాని.

ఇంద్రగంటి-నాని కాంబోలో ఇప్పటివరకు ఏదీ ఫెయిల్ అవ్వలేదు. పుష్కరం కిందట వచ్చిన అష్టాచమ్మా సినిమా హిట్ అయింది. ఆ తర్వాతొచ్చిన జెంటిల్ మేన్ సినిమా కూడా హిట్ అయింది. సో.. ఈ సినిమాతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుందని అంతా భావిస్తున్నారు.