తార‌క‌ర‌త్న రెస్టారెంట్ కూల్చివేత‌

GHMC demolishes drive-in restaurant
Monday, February 4, 2019 - 16:00

నంద‌మూరి తార‌క‌ర‌త్నకి చెందిన స్థ‌లంలో నిర్వ‌హిస్తున్న డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ని జీహెచ్ెంసీ అధికారులు కూల్చివేశారు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఈ రెస్టారెంట్‌లో అర్ధ‌రాత్రి త‌ర్వాత కూడా డీజే సౌండ్‌లు, మ‌ద్యం విక్ర‌యం జ‌రుగుతున్నాయ‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు రెస్టారెంట్‌ని కూల్చారు. ఆ టైమ్‌లో విష‌యం తెలుసుకున్న తార‌క‌ర‌త్న అక్క‌డికి వ‌చ్చి కొంత హ‌డావుడి చేశాడు. ఐతే నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నారనే ఫిర్యాదులు రావడంతోనే కూల్చుతున్నామ‌ని అధికారులు తారకరత్నకు వివరణ ఇచ్చారు. కొంత గంద‌ర‌గోళం త‌ర్వాత అథికారులు ప‌ని పూర్తి కానిచ్చ‌న‌ట్లు స‌మాచారం.

తార‌క‌ర‌త్న ఈ స్థ‌లాన్ని లీజ్‌కిచ్చాడ‌ట‌.