చాణ‌క్య‌గా వ‌స్తున్న గోపిచంద్‌

Gopichand as Chanakya
Saturday, June 8, 2019 - 22:45

గోపిచంద్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రానికి "చాణ‌క్య" అనే పేరుని ఖ‌రారు చేశారు. సినిమాటోగ్రాఫ‌ర్ తిరు ద‌ర్శ‌క‌త్వంలో గోపిచంద్ హీరోగా రూపొందుతోన్న మూవీ ఇది. అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్త‌యింది. 

చాలా భాగాన్ని నార్త్ ఇండియాలో తీశారు. మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీని సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. గోపిచంద్ క్యార‌క్ట‌రైజేష‌న్‌కి, ఈ సినిమా టైటిల్‌కి లింక్ ఉంది.