దోశలు బాగా వేసే మరో హీరో

Gopichand is good at preparing dosas
Friday, April 24, 2020 - 23:00

పెసరట్టు వెయ్యడం ఒక కళ. దోశ వెయ్యడమూ అంతే. దోశను ఫ్లిప్ చెయ్యడం (పెనంతో గాల్లోకి పైకి విసిరి తిప్పడం) అంటారా... అది చెఫ్ లకి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్. చిరంజీవి మాత్రం పెసరట్టుని అవలీలగా ప్లిప్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మెగాస్టార్ వంటల్లో కూడా స్టార్ చెఫ్ అనిపించుకున్నారు. 

అయితే ... దోశలు వెయ్యడంలో నేను కూడా సూపర్ స్టార్ ని అంటున్నారు గోపీచంద్. ఈ క్వారంటైన్ టైంలో ఇంట్లో దోశలు వేసే బాధ్యత తానే తీసుకున్నట్లు తెలిపారు గోపీచంద్. దోశల్లో రకరకాలవి ట్రై చేస్తూనే ఉంటాడట. 

ఇలా తన రుచి అభిరుచిని బయట పెట్టాడు. గోపీచంద్ నటిస్తున్న "సీటిమార్" షూటింగ్ ఆగిపోయింది లాక్డౌన్ వల్ల. సంపత్ నంది డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ ఇది. అంతే కాదు, చారిటీ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు గోపి. హైదరాబాద్ లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వెయ్యి కుటుంబాలకు సాయం అందించాడు గోపీచంద్. అలాగే సీసీసీకి పది లక్షల రూపాయలు డొనేట్ చేశారు.