షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ గోపిచంద్‌

Gopichand injured on sets
Monday, February 18, 2019 - 14:00

హీరో గోపిచంద్ గాయ‌ప‌డ్డాడు. షూటింగ్‌లో స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వం లో అనిల్ సుంకర నిర్మిస్తొన్న భారీ యాక్షన్ మూవీ ప్రస్తుతం జైపూర్ దగ్గర  మండ‌వాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

సోమవారం యాక్ష‌న్ తీస్తున్న సంద‌ర్భంలో గోపిచంద్‌కి గాయాలు అయ్యాయి. బైక్ ఛేజింగ్ సీన్లు తీస్తున్న సమయంలో బైక్ స్కిడ్ అవ్వటంతో గోపిచంద్ గాయ‌ప‌డ్డాడు.  గోపిచంద్ ఆరొగ్యానికి ఎలాంటి హాని లేదని, గాయాలకు ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం మిగిలిన చిత్రీకరణ చెసుకొవచ్చని అక్కడి ఫోర్టీస్ హాస్పిటల్స్  డాక్టర్స్ తెలిపారు. దాంతో తిరిగి సెట్స్‌కి వ‌చ్చి...షూటింగ్‌లో పాల్గొన్నాడు గోపిచంద్‌.

గోపిచంద్‌కి రీసెంట్‌గా స‌రైన విజ‌యాలు లేవు. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.