చాణక్య నా పేరు కాదు

Gopichand talks about Chanakya
Friday, October 4, 2019 - 18:30

మరికొన్ని గంటల్లో ధియేటర్లలోకి రాబోతోంది చాణక్య. ఈ టైటిల్ పై ఉన్న ఊహాగానాల్ని గోపీచంద్ ఖండించాడు. సినిమాలో తన పేరు చాణక్య కాదని స్పష్టంచేశాడు. ట్రయిలర్ చూస్తే తన పేరేంటో తెలిసిపోతుందని, చాణక్య అనేది అసలు క్యారెక్టర్ పేరు కాదని అంటున్నాడు.

"చాణక్య అనేది నా పేరు కాదు. సినిమాలో మిషన్ పేరు. ఆ మిషన్ ఏంటనేది రేపు స్క్రీన్ మీద చూడబోతున్నారు. తిరు ఈ టైటిల్ చెప్పగానే అందరికీ బాగా నచ్చేసింది. క్యాచీగా కూడా ఉందన్న ఉద్దేశ్యంతో పెట్టేశాం."

ఇలా టైటిల్ వెనకున్న సస్పెన్స్ ను రివీల్ చేశాడు గోపీచంద్. ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన గోపీచంద్.. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని, ఎప్పుడూ ఇంత కష్టం అనిపించలేదని చెప్పుకొచ్చాడు. యాక్సిడెంట్ అవ్వడం కూడా ఓ కారణం కావొచ్చన్నాడు. ఈ సినిమా తర్వాత తను చేయబోయే మూవీస్ గురించి కూడా మాట్లాడాడు.

"బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్నాను. అది ఓ అడ్వెంచర్ సినిమా. ఆడియన్స్ కు ‘సాహసం’ లాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అలాగే సంపత్ నందితో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాను. ఆ సినిమా కబడ్డీ నేపథ్యంలో ఉండబోతుంది. ఈ రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేస్తాను."

గతంలో వచ్చిన గ్యాప్ ను ఇలా బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో భర్తీచేస్తానంటున్నాడు గోపీచంద్. చాణక్య సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానంటున్నాడు.