హరీష్‌ టంగ్‌ కంట్రోల్‌లో పెట్టుకున్నట్లేనా

Haish controls his tongue
Tuesday, September 24, 2019 - 14:30

హరీష్‌ శంకర్‌ ఇపుడు కొంత తగ్గాడు. గతంలో లాగే మనసుకి ఏది తోచితే ...అది మాట్లాడడం తగ్గించాడు. హరీష్‌కి టంగ్‌ కంట్రోల్‌లో ఉండదు అని ఆ మధ్య దిల్‌రాజు స్టేజ్‌ మీదే చెప్పాడు. హరీష్‌కి గొప్ప టాలెంట్‌ ఉంది. ఆవేశం, నోరు అదుపులోకే పోవడం వల్లే ఇబ్బంది అని దిల్‌రాజు అసలు విసయం బయటపెట్టాడు. ఇపుడు హరీష్‌లో స్పష్టమైన మార్పు వచ్చింది.

వాల్మీకీ సినిమా టైటిల్‌ వివాదంలో కూడా హద్దు దాటలేదు. ఇపుడు సినిమా మంచి విజయం సాధించడంతో సినిమాని మహర్షి వాల్మీకికి అంకితం ఇస్తున్నాను అని చెప్పాడు. ఐతే సినిమా హిట్టయింది కదా అని ...తన సినిమా టైటల్‌పై అభ్యంతరం చెప్పిన వారిని ఒక్క మాటా అనలేదు. గతంలోలా ఉండి ఉంటే... గట్టిగా మాట్టాడేవాడు. 

మార్పు మంచిదే కదా. అన్నట్లు నెక్స్ట్‌ సినిమాని తన గబ్బర్‌సింగ్‌ హీరో పవన్‌ కల్యాణ్‌తో తీయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే పవర్‌స్టార్‌కి వెళ్లి కథ చెప్పాడు. పవన్‌ కల్యాణ్‌.. మళ్లీ నటించాలని అనుకుంటున్న మాట వాస్తవమే. కానీ అది ఎపుడు అనేది ఇంకా తేలలేదు.