నేనూ నా హీరోలు: హంసా

Hamsa Nandini talks about various stars that she'd worked with
Thursday, May 28, 2020 - 14:30

హీరోలపై ఒక్కో హీరోయిన్ కు ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. కొంతమంది హీరోలతో, కొంతమంది హీరోయిన్లకు ఓ ప్రత్యేకమైన బంధం ఉంటుంది. స్పెషల్ సాంగ్ లతో పేరొందిన హంసా నందినికి కూడా కొంతమంది హీరోలతో అలాంటి స్పెషల్ బాండ్ ఉంది. ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, నాగార్జునతో సినిమాలు చేసిన హంసా.. వాళ్ల గురించి ఏం చెబుతోందో చూద్దాం..

ప్రభాస్
"మిర్చి" చేసినప్పుడు ప్రభాస్ తో పరిచయం. నిజానికి ప్రభాస్ అప్పుడు నా మైండ్ లో లేడు. మిర్చి ఐటెంసాంగ్ కు డాన్స్ ఎలా చేయాలనే అంశంపైనే నా ఫోకస్ మొత్తం ఉంది. అందుకే ప్రభాస్ తో పెద్దగా మాట్లాడలేకపోయాను. దీనికితోడు "మిర్చి"లో నాది-ప్రభాస్ కాంబినేషన్ షూట్ ను ఒక్క రోజులో పూర్తిచేశారు. నేను గమనించింది ఏంటంటే ప్రభాస్ చాలా కూల్ అండ్ కామ్.

నాగార్జున
నాగ్ సర్ తో "భాయ్" చేశాను. ఆ తర్వాత "సోగ్గాడే చిన్ని నాయన" చేశాను. భాయ్ కంటే సోగ్గాడే టైమ్ లో నాగ్ తో బాగా ఎంజాయ్ చేశా. నాగ్ ఎప్పుడు చూసినా నవ్వుతూ కనిపిస్తారు. అది నాకు ఇష్టం.

Hamsa Nandiniబాలయ్య
బాలయ్య చాలా ఎనర్జిటిక్. "లెజెండ్"లో ఆయనతో నటించా. అంతకంటే ముందు 2 సార్లు కలిశాను. ఆయన మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. షాట్ గ్యాప్ లో కూడా ఆయన రెస్ట్ తీసుకోడు. ఆయన ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ.

పవన్ కల్యాణ్
పవన్ చాలా కూల్. "అత్తారింటికి దారేది" సినిమాలో పార్టీ సాంగ్ లో పవన్ తో డాన్స్ చేశా. అప్పుడే అమెరికా నుంచి రావడంతో జెట్ లాగ్ ఉంది. అందుకే పవన్ తో పెద్దగా మాట్లాడలేకపోయాను. పవన్ చాలా సరదాగా ఉంటారు. పైగా మేమిద్దరం నా మాతృభాష మరాఠీలో మాట్లాడుకుంటాం.

ఎన్టీఆర్
తారక్ చాలా ఫన్నీ. మంచి జోకులేస్తాడు. "జై లవకుశ" టైమ్ లో బాగా ఎంజాయ్ చేశాను. ఆ సినిమాలో కామెడీ పార్ట్ మొత్తం నా క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. తారక్ తో వచ్చే నా సన్నివేశాల్ని ఇప్పటికీ చూసి ఎంజాయ్ చేస్తుంటాను.