ఈ భామ‌కి మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తాడా బాల‌య్య‌?

Haripriya to act with Balayya again
Wednesday, May 8, 2019 - 20:00

నంద‌మూరి బాల‌కృష్ణ కొత్త సినిమా ఈ నెల 17న లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. కె.ఎస్‌.ర‌వికుమార్ డైర‌క్ష‌న్‌లో సినిమా షురూ అవుతుంది. జైసింహా సినిమా పెద్ద‌గా ఫ్యాన్స్‌ని మెప్పించ‌క‌పోయినా.... క‌మ‌ర్షియ‌ల్‌గా ఫ‌ర్వాలేద‌నిపించుకొంది. అందుకే బోయ‌పాటి సినిమాని ప‌క్క‌న పెట్టి మ‌రీ కె.ఎస్‌.రవికుమార్ సినిమాని ఓకే చేశాడు బాల‌య్య‌. ఆయ‌న‌కి ఈ సినిమా అంత‌గా కంఫ‌ర్ట్‌.

ఎందుకంటే కె.ఎస్‌.ర‌వికుమార్ పాత క‌థ‌నే కొత్త‌గా ప్రెజెంట్ చేస్తాడు. ప్ల‌స్ స్పీడ్‌గా సినిమాని పూర్తి చేశాడు. బ‌డ్జెట్ హ‌డావుడి కూడా ఉండ‌దు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యంలో ఊహాగానాలు సాగుతున్నాయి. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌కుడు, నిర్మాత సీ క‌ల్యాణ్ కాబ‌ట్టి త‌న‌కి మ‌రోసారి అవ‌కాశం వస్తుంద‌ని బెంగుళూర్ బ్యూటీ ఆశ‌ప‌డుతోంది. జైసింహ సినిమాలోనూ ఆమెకి ఒక పాత్ర ఇచ్చారు. 

ఈ సినిమాలోనూ ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ట‌. మెయిన్ హీరోయిన్‌గా ఎవ‌ర్ని తీసుకుంటారో చూడాలి.