ఫస్ట్ టైం ఓడిపోయాను : హరీష్ శంకర్

Harish Shankar about title title change of Valmiki
Thursday, September 19, 2019 - 23:00

దర్శకుడు హరీష్ శంకర్ వాల్మీకి టైటిల్ చేంజ్ గురించి మాట్లాడాడు. ఫస్ట్ టైం తాను ఓడిపోయాను అన్నట్లుగా చెప్పాడు. సినిమా టైటిల్ ని సినిమా విడుదలకి కొద్దీ గంటల ముందు మార్చాల్సి రావడంతో బాధ పడుతున్నాను అన్నాడు. బోయ వాల్మీకి కులస్తులు సినిమా టైటిల్ మార్చాలని కోర్టుకు వెళ్లడంతో చివరి నిమిషంలో గద్దలకొండ గణేష్ గా మార్చారు. 

 •  వాల్మీకి టైటిల్ చాలా మంచి టైటిల్
   
 • ఫస్ట్ టైం ఓడిపోయాను
   
 • ఆ మహర్షి మీద వున్న గౌరవం తో ఈ టైటిల్ పెట్టాను
   
 • నేను ... నేను వాల్మీకి మహర్షి గొప్పతనం గురించి చెప్పాను
   
 • నా బాధ ఏమిటంటే సినిమా చూడకుండా ఇలా డిస్ట్రబ్ చేయడం కరెక్ట్ కాదు
   
 • కోట్ల రూపాయలతో సినిమా తీసినప్పుడు ఏరి కోరి కాంట్రవర్సీ ఎందుకు తెచ్చుకుంటాము
   
 • బోయ సోదరులకు నా విజ్ఞప్తి ఏమిటంటే సినిమా చూసి చెప్పండి... మేము చేసింది కరెక్టా కదా అనేది మీకు తెలుస్తుంది
   
 • సెన్సార్ వాళ్ళు సినిమా చూసి మెచ్చుకున్నారు
   
 • డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ నష్ట పోకూడదని ఈ సినిమా టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్చాము
   
 • వాళ్లకు సినిమా చూపిస్తాము అని అన్నాము. కానీ వారు సినిమా చూడకుండా అపార్ధం చేసుకున్నారు
   
 • నేను ఓడిపోయినా సినిమా ఘన విజయం సాధిస్తుంది