హ‌రీష్ క‌థ‌ని మార్చేస్తున్నాడా?

Harish Shankar changing storyline of Jigarthanda
Saturday, December 22, 2018 - 09:30

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌న కొత్త సినిమా వ‌ర్క్‌ని మొద‌లుపెట్టాడు. త్వ‌ర‌లోనే సినిమా సెట్ మీద‌కి వెళ్ల‌నుంది. త‌మిళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకొని మంచి విజ‌యం సాధించిన జిగ‌ర్ తండా అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు హ‌రీష్‌. ఐతే ఆ సినిమాలోని మూల‌క‌థ‌, క్యార‌క్ట‌రైజేష‌న్లు మాత్ర‌మే తీసుకొని మిగ‌తా అంత త‌న‌దైన‌శైలిలో మార్చేస్తున్నాడ‌ని స‌మాచారం.

ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు మొత్తంగా క‌థ‌ని మార్చేస్తున్నాడ‌నేది అబ‌ద్దం.

ద‌బాంగ్ సినిమాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్లుగా మార్చిన విధానం అంద‌రికీ న‌చ్చింది. సినిమా సెన్సేష‌న‌ల్ హిట్ట‌యింది. ఇపుడు జిగ‌ర్‌తండా ఆత్మ పోకుండా మ‌రింత ర‌సవ‌త్త‌రంగా, క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో మారుస్తున్నాడ‌ట‌. వ‌రుణ్ తేజ్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాడు. 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ నిర్మించ‌నుంది.

డీజే సినిమా విడుద‌లైన త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్‌...నాలుగు స్తంభాలాట అనే రొమాంటిక్ డ్రామాని తీయాల‌నుకున్నాడు ఐతే ఆ సినిమాకి క్యాస్టింగ్ కుద‌ర‌లేదు. దాంతో ఇపుడు నేటి ట్రెండ్‌కి త‌గ్గ బ్లాక్‌కామెడీతో కూడిన జిగ‌ర్‌తండా రీమేక్‌ని ఎంచుకున్నాడు.