కాజల్ స్థానం తమన్నా కొట్టేసిందా?

Has Tamannah replaced Kajal's position?
Tuesday, September 10, 2019 - 17:00

రియల్ లైఫ్ లో వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. కెరీర్ పరంగా కూడా ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేకుండా చూసుకుంటారు. వీకెండ్స్ వచ్చాయంటే, టైమ్ చిక్కితే కలిసి పార్టీ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వీళ్లిద్దరి మధ్య ఓ సినిమా చిచ్చుపెట్టిందట. కాజల్ స్థానంలో తమన్నను తీసుకున్నారట. కొన్ని బాలీవుడ్ సైట్స్ ఈ విషయాన్ని ప్రముఖంగా చెప్పుకొచ్చాయి.

హిందీలో ఓ సినిమా చేస్తోంది కాజల్. సంజయ్ గుప్తా దర్శకత్వంలో జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హస్మి హీరోలుగా వస్తున్న ఆ సినిమా పేరు ముంబయి సాగ. ఈ సినిమా నుంచి కాజల్ ను తప్పించారంటూ కొన్ని ముంబయి సైట్లు కథనాలు రాసుకొచ్చాయి. ఆమె స్థానంలో తమన్నను తీసుకున్నారంటూ పుకార్లు అల్లాయి. బహుశా వాళ్లకు తెలియదనుకుంటా, కాజల్-తమన్న బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం.

ఈ పుకార్లపై స్వయంగా ఆ సినిమా దర్శకుడు సంజయ్ గుప్తా రియాక్ట్ అయ్యాడు. ఆల్రెడీ కాజల్ తో ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశామని, ఆమె లాంటి ప్రొఫెషనల్ నటిని చూడలేదంటూ ట్వీటాడు. దీనికి కాజల్ కూడా రీట్వీట్ కొట్టింది. దీంతో ఈ పుకార్లు ఇక్కడితో ఆగిపోయాయి.