ప్రియాని మరిచిపోయినట్లేనా

Have people forgotten about Priya Varrier
Wednesday, April 17, 2019 - 12:00

ప్రియా వారియర్‌ని అందరూ మరిచిపోయినట్లేనా అంటే సమాధానం ఔనని వస్తోంది. గత ఏడాది దేశమంతా సంచలనం సృష్టించింది ప్రియా వారియర్. ఆమె నటించిన తొలి సినిమా ఈ ఏడాది తెలుగులో "లవర్స్ డే" పేరుతో విడుదలయింది. తెలుగులోనే కాదు మలయాళం, హిందీ, తమిళం..అన్నీ భాషల్లో రిలీజ్ అయి ఢమాల్ అనిపించుకొంది.

మొదటి సినిమాతోనే ప్రియా క్రేజ్ తగ్గిపోయింది. ఆమె నటించిన రెండో మూవీ "శ్రీదేవి బంగ్లా"కి ఇపుడు క్రేజ్ లేదు. ప్రియా వారియర్ వన్ ఫిల్మ్ వండర్గానే మిగిలిపోతుందా?