హెబ్బా ఓ 'స్పెషల్' హీరోయిన్

Hebah Patel favorite for special songs and roles
Saturday, March 21, 2020 - 10:45

ఇండస్ట్రీకి చాలామంది హీరోయిన్లు పరిచయమౌతుంటారు. అందరికీ హీరోయిన్ పాత్రలే కావాలి. మరోవైపు మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండనే ఉన్నారు. అయితే అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాకుండా, ఇటు హీరోయిన్ గా కాకుండా చేయాల్సిన పాత్రలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు హీరోయిన్ ఫ్రెండ్ గానో, హీరోయిన్ అక్కగానో, హీరోయిన్ క్లాస్ మీట్ గానో చేయాల్సిన పాత్రలు కొన్ని ఉంటాయి. మరీ ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ అవకాశాలు కూడా ఉన్నాయి.ఈ సెగ్మెంట్ లో హీరోయిన్ల కొరత బాగా ఉంది. ఇప్పుడీ గ్యాప్ లోకి హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంటరైంది.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో ప్రత్యేక పాత్రలు, ప్రత్యేక సాంగ్స్ కు ఓకే చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. మొన్నటికిమొన్న భీష్మ సినిమాలో "రక్తికట్టించే" క్యారెక్టర్ చేసింది హెబ్బా. సినిమా స్టార్టింగ్-ఎండింగ్ లో మెరుపులా కనిపించి తన అందాలతో అదరగొట్టింది. ఇప్పుడు అలాంటిదే మరో పాత్రకు కూడా ఆమె ఒప్పుకుంది.

రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ సినిమాలో కూడా హెబ్బా పటేల్ ఉంది. ఇప్పటికే మూవీలో ఉన్న ముగ్గురు హీరోయిన్లకు ఈమె అదనం అన్నమాట. ఇందులో రామ్ రెండు పాత్రలు పోషిస్తున్నాడు. వీటిలో ఒక పాత్ర ఇంట్రడక్షన్ సాంగ్ లో హెబ్బా "కనువిందు" చేయబోతోంది.

ఇలా ప్రత్యేక గీతాలు, ప్రత్యేక పాత్రలకు సెట్ అయిపోతోంది ఈ గుజరాతీ పిల్ల. అన్నట్టు రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాలో కూడా ఇలాంటిదే ఓ మెరుపు పాత్ర పోషించింది.