18 ఉంచుకో బాస్!

Hero offers 18k for director
Saturday, December 28, 2019 - 15:15

కొందరు దర్శకులు సినిమాకి 15 కోట్లు, 20 కోట్లు తీసుకునుంటున్నారు. ఆలా వుంది వారి సుడి. ఇక కొత్తవాళ్ళకి కూడా కొందరు నిర్మాతలు గౌరవ ప్రదమైన మొత్తమే ఇస్తున్నారు. కనీసంగా ఒక 5 నుంచి 10 లక్షలు కొత్త దర్శకులకి కూడా ఇవ్వడం ట్రెండ్. ఐతే, ఒక నటుడు కం నిర్మాత మాత్రం కొత్త దర్శకుల అవసరాన్ని అడ్డంగా క్యాష్ చేసుకుంటున్నాడు అని టాక్. డబ్బు కోసం కాకుండా అవకాశం వస్తే దశ తిరుగుతుందని ఉద్దేశంతోనే ఉంటారు కొత్త దర్శకులు. అయితే మరి ఖర్చులకి కూడా సరిపోనంతగా ...మరి జీతం ఇవ్వడం ఘోరం. 

అలాంటి పనే చేస్తున్నాడట సదరు హీరో. కొత్త దర్శకులకి ఛాన్స్ ఇచ్చే ఇతను.. వారికీ 18 వేలు జీతం ఫిక్స్ చేస్తున్నాడట. కో-డైరెక్టర్లు లక్షల్లో జీతాలు తీసుకుంటున్న టైములో దర్శకుడికి 18 వేలు నెల జీతంగా ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? ఆయన దానికి తన 'సెంటిమెంట్' ఇది అని కొత్త దర్శకులని మొహమాట పెట్టేస్తున్నాడట. ఈ టాక్ బాగా స్ప్రెడ్ అయి... న్యూ టాలెంట్ ఆ గడప తొక్కడమే బంద్ చేశారట. 

మొహమాటంకి పోతే అది ఎదో అయింది అన్న సామెత గుర్తొచ్చి కొత్త దర్శకులు దడుసుకుంటున్నారట