యాక్సిడెంట్‌... హీరో సుధాక‌ర్‌కి త‌ప్పిన ప్ర‌మాదం

Hero Sudhakar Komakula escapes with minor injuries in road accident
Saturday, April 27, 2019 - 23:15

"లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" సినిమాతో పేరు తెచ్చుకున్న హీరో సుధాక‌ర్ కోమకుల‌కి తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు మంగ‌ళ‌గిరి వ‌ద్ద డివైడ‌ర్‌ని ఢీకొట్టింది. సుధాక‌ర్ కోమ‌కుల 
"నువ్వు తోపు రా" అనే సినిమాలో న‌టించాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం గుంటూరు వెళ్తున్నాడు.

హైద్రాబాద్ నుండి గుంటూరు ప్రయాణిస్తున్న కార్ నేషనల్ హైవే 5 మీద మంగళగిరి సమీపంలో డివైడర్ ని ఢీకొట్టింది, ఈ ఘటన లో హీరో సుధాకర్ తో పాటు మూవీ టీం సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కార్ డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడం తో మంగళగిరి NRI హాస్పిటల్ లో చేర్చారు.