విజ‌య్ దేవ‌ర‌కొండ వెర్సెస్ శివ‌కార్తీకేయ‌న్‌

Hero Title Row: Vijay Deverakonda Vs Siva Karthikeyan
Wednesday, March 13, 2019 - 23:00

విజ‌య్ దేవ‌ర‌కొండ నాలుగు భాష‌ల్లో త‌మిళ ద‌ర్శ‌కుడితో హీరో పేరుతో ఒక మూవీ చేయ‌నున్నాడు. నాలుగు భాష‌ల్లోనూ ఒకే పేరు ఉండాలి. అది ఇప్ప‌టి ట్రెండ్‌. "బాహుబ‌లి", "కేజీఎఫ్‌", "2.0" వంటి మ‌ల్టీలాంగ్వేజ్ సినిమాలు ఈ ప‌ద్ద‌తిని క్రియేట్ చేశాయి. త్వ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ కూడా ఇదే పేరుతో అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ కానుంది. అదే పంథాలో "హీరో" అనే సినిమాని అనౌన్స్ చేశాడు. 

స‌రిగ్గా ఇదే రోజు..త‌మిళంలో యువ హీరో శివ‌కార్తీకేయ‌న్ త‌న కొత్త సినిమాని ప్రారంభించాడు. దాని పేరు "హీరో". త‌మిళ ఫిల్మ్ చాంబ‌ర్‌లో శివ‌కార్తీకేయ‌న్ ఆల్రెడీ టైటిల్ రిజిష్ట‌ర్ చేశాడు. సినిమా ప్రారంభోత్స‌వం నాడే పేరు కూడా చెప్పేశారు. 

మ‌రి విజ‌య్ దేవ‌ర‌కొండ ఇపుడు త‌న సినిమాకి వేరే పేరుని పెట్టుకుంటాడా లేక తమిళ వెర్స‌న్ వ‌ర‌కు వేరే పేరు చూజ్ చేసుకుంటాడా అనేది చూడాలి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి త‌మిళ‌నాడులో మంచి మార్కెట్ ఉంది. అందుకే విజ‌య్ ఇక‌పై త‌న కొత్త సినిమాల టైటిల్స్ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. అన్ని భాష‌ల్లోనూ ఒకేసారి రిజిష్ట‌ర్ చేసుకోవాలి.