వాట్స‌ప్ చాట్ బ‌య‌ట‌పెడుతా!

Heroine threatens to reveal whatsapp chat
Thursday, December 13, 2018 - 16:45

ఒక యువ హీరోయిన్ ఒక నిర్మాత‌ను బెదిరించ‌డం మొద‌లుపెట్టింద‌ట‌. ఆ నిర్మాత చేసిన నిర్వాకంతో ఇలా అయింద‌ట‌.

అస‌లు విష‌యానికొస్తే.. వ‌రుస‌గా ఫ్లాప్‌లు ఇస్తున్న ఒక హీరోయిన్‌ని ఒక వ‌ర్ధ‌మాన నిర్మాత త‌న కొత్త సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఆమెకి భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. కానీ కొద్ది రోజుల‌కే ఆ సినిమా నుంచి హీరో త‌ప్పుకున్నాడు. దాంతో ఆ నిర్మాత ఇపుడు అదే మూవీని మ‌రో హీరోతో మొద‌లుపెడుతున్నాడు. ఈ యువ హీరోకిది కేవ‌లం రెండో సినిమానే.

ఈ యువ హీరో ప‌క్క‌న ఆ హీరోయిన్ బాగుండ‌ద‌నే ఉద్దేశంతో త‌న అడ్వాన్స్ త‌న‌కివ్వాల‌ని ఆ నిర్మాత ఆమెని కోరాడ‌ట‌. కానీ ఆమె మొత్తం అడ్వాన్స్ తిరిగి ఇచ్చేందుకు నిరాకరించింది. అత‌ను ఆమెని బెదిరించే ప్ర‌య‌త్నం చేశాడ‌ట‌. ఆమె రివ‌ర్స్‌లో నువ్వు నాతో వాట్స‌ప్‌లో చేసిన చాట్‌ని బ‌య‌ట‌పెడుతా అని చెప్పింద‌ట‌. దాంతో ఆ నిర్మాత రాజీకొచ్చాడ‌ట‌.

ఇంత‌కీ ఆ వాట్సప్ చాట్‌లో ఏముందో?