మిడిల్ డ్రాప్ అవుతున్న హీరోయిన్లు

Heroines dropping their careers
Sunday, March 15, 2020 - 18:45

హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. హీరోల్లా వీళ్లు దండయాత్రలు చేయలేరు. అంత సీన్ కూడా వీళ్లకు ఉండదు. ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత మరో అవకాశం కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి. పైగా బాగా కాంపిటిషన్ ఉన్న ఫీల్డ్ అది. దాంతో చాలామంది హీరోయిన్లు మధ్యలోనే తమ కెరీర్ ను వదిలేస్తుంటారు. కొందరు ప్రత్యామ్నాయ కెరీర్స్ పై దృష్టిపెడితే, మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోతుంటారు.

తాజాగా ఈ లిస్ట్ లోకి నికీషా పటేల్ కూడా చేరిపోయింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో తన భవిష్యత్తు వెలిగిపోతుందని కలలుకంది. కట్ చేస్తే, కొమరంపులి డిజాస్టర్ అయింది. పవన్ కు ఏం కాలేదు కానీ నికీషా మాత్రం ఆ ఒక్క దెబ్బకు ఎగిరిపడింది. ఆమె కెరీర్ ఎంత ఘనంగా మొదలైందో, అంతే వేగంగా బ్రేక్ పడింది. అప్పట్నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, రీసెంట్ గా గుడ్ బై చెప్పేసింది. లండన్ కు మకాం మార్చేసింది.

నికీషా కంటే ముందే రిచా ఆ పనిచేసింది. తనకిక అవకాశాలు రావడం కష్టమని గ్రహించిన ఈ చిన్నది, మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించేందుకు అమెరికా వెళ్లిపోయింది. అక్కడే ఆమె ప్రేమలో పడడం, ఈమధ్యే పెళ్లి కూడా చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.

రిచా గంగోపాధ్యాయ టైపులోనే హీరోయిన్లు మనాలీ రాధోడ్, వేద (అలియాస్ అర్చన) పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. ఇక మరో హీరోయిన్ సాయేషా కూడా తన సహనటుడు ఆర్యను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత బందోబస్త్ లాంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ, ప్రస్తుతం సాయేష్ కు అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె ఇక ఇంటికే పరిమితమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వీళ్లతో పాటు మిస్తీ చక్రవర్తి, స్టెఫీ పటేల్, సాక్షి చౌదరి లాంటి ఎంతోమంది హీరోయిన్లు ఇలా మిడిల్ డ్రాప్ అయిన లిస్ట్ లో ఉన్నారు