హైకోర్టు లో లక్ష్మీస్ ఎన్టీఆర్, బోర్డుకి నోటీసులు

High Court sends notices to Censor Board over RGV's Lakshmi's NTR
Tuesday, January 22, 2019 - 23:45

రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" వివాదాలు క్రియేట్ చేస్తోంది. కోర్టు కేసుల‌నూ ఆహ్వానిస్తోంది. వ‌ర్మ‌కి కావాల్సింది కూడా అదే. ఎంత వివాదం రేగితే, సినిమాకి అంత మంచిది. అదే వ‌ర్మ పాటించే ప‌బ్లిసిటీ సూత్రమిదే. ఆయ‌న ఊహించిన‌ట్లే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక‌రు ఈ సినిమాపై హైకోర్టుని ఆశ్రయించారు. 

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్న "వెన్ను పాట"ను తొలగించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే హైకోర్టులో  పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డుకి నోటీసులు జారీ చేసింది. ఒక ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా పాట పెడితే ఆ పాట‌ని ఎలా సెన్సార్ చేశారు? అంటూ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. దీనిపై విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

ఐతే వెన్నుపోటు పాట‌ని వ‌ర్మ యూట్యూబ్‌లో విడుద‌ల చేశాడు. యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన పాట‌కి సెన్సార్ అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి కాదు. టెక్నిక‌ల్‌గా వ‌ర్మ‌కి వ‌చ్చిన స‌మ‌స్య ఏమీలేదు. ఎన్టీ రామారావు నిజ‌మైన జీవిత చ‌రిత్రని "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌"లో చూపిస్తున్నాను అని వ‌ర్మ అంటున్నాడు. ఎన్టీఆర్ పాత్ర‌ని ఒక థియేట‌ర్ న‌టుడు పోషిస్తుండ‌గా, లక్ష్మీపార్వ‌తి పాత్ర‌ని య‌క్ష షెట్టి పోషిస్తోంది.