డిస్కోరాజాకి హాలీవుడ్‌ స్టంట్స్‌

Hollywood stunt masters for Diso Raja
Monday, September 16, 2019 - 13:30

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం..."డిస్కోరాజా". ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. రవితేజతో ఎక్కువ ఖర్చు పెట్టి తీస్తే నిర్మాత గుండు కొట్టించికోవాల్సిందే అన్న కామెంట్‌లు వినిపిస్తున్న టైమ్‌లో డిస్కోరాజా నిర్మాత డబ్బుని విపరీతంగా వెదజల్లుతున్నాడట. యాక్షన్‌ సీన్ల కోసం, గ్రాఫిక్స్‌ కోసం కోట్లు కుమ్మరిస్తున్నాడు. ఇందులో నిజానిజాలు ఎంతో కానీ.. ఆ టీమ్‌ చెపుతున్న దాని ప్రకారం గ్రాఫిక్స్‌, యాక్షన్‌ స్టంట్స్‌..అన్నీ హైలెవలేనట.

ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో దర్శనమిస్తాడు. హీరో మంచు కొండల్లో కూరుకుపోయిన ఒక సీన్‌ కోసం భారీగా ఖర్చు పెట్టనున్నారట. వీటిని ఐస్‌ల్యాండ్‌ దేశంలో తీయనున్నారు. ఐస్ ల్యాండ్ లో షూట్ చేయబోతున్న కొన్ని కీలక సన్నివేశాల కోసం ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు భారీ గా ఖర్చు చేయబోతున్నారు. నిర్మాత రామ్ తళ్ళూరి దర్శకుడు వి ఐ ఆనంద్ విజన్ కి తగినట్లుగా బడ్జెట్ విషయం లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిస్కో రాజా ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఐస్ ల్యాండ్ లో సెప్టెంబర్ 17 నుంచి జరగబోతున్న షెడ్యూల్ ని  దాదాపు 4 - 5 కోట్ల రూపాయలు బడ్జెట్ తో తీస్తున్నారని నిర్మాణ సంస్థ చెపుతోంది.

ఈ కీలక సన్నివేశం డిస్కో రాజా సినిమా లో కేవలం నాలుగు  నిముషాల నిడివి మాత్రమే ఉండటం కొస మెరుపు.  

"ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7 అనే హాలీవుడ్‌ చిత్రం కోసం పనిచేసిన యాక్షన్ స్టంట్ మాస్టర్స్ ఊలి టీం  డిస్కో రాజా కోసం రంగం లోకి దిగబోతున్నారు. సినిమా కి హైలైట్ గా ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయి," అని డిస్కో రాజా టీం చెబుతుంది.