విజ‌య‌శాంతికి ఎంతిచ్చి ఒప్పించార‌ట‌!

How much remuneration would Vijayashanti take?
Tuesday, April 23, 2019 - 15:30

విజ‌య‌శాంతి మ‌ళ్లీ న‌టిస్తున్నారు. రాముల‌మ్మ గ‌త ప‌దిహేడేళ్లుగా సినిమా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంద‌నేది అందిర‌కీ తెలిసిందే.. ఈ గ్యాప్‌లో ఆమె తెరాస‌లోనూ, భాజాపాలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ రాజ‌కీయాలు చేశారు. ఐతే ఆమెకి పాలిటిక్స్‌లో ల‌క్ క‌లిసి రాలేదు. తెరాస‌లో ఉండి ఉంటే మంత్రి అయి ఉండేది కానీ కాంగ్రెస్‌లో చేరి ఎటు కాకుండా పోయారిపుడు. కాంగ్రెస్‌కి ప్ర‌స్తుతం తెలంగాణ‌లో గ‌డ్డు ప‌రిస్థితులున్నాయి. క‌నీసం మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు ఆమెకి కాంగ్రెస్ పార్టీ వ‌ల్ల ఎలాంటి ప‌ద‌వి రాదు. అందుకే మ‌ళ్లీ న‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నారు ఫైర్‌బ్రాండ్ విజ‌య‌శాంతి.

మ‌హేష్‌బాబు కొత్త సినిమాలో విజ‌య‌శాంతి ఒక అత్యంత కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తారు. ఆమెని దృష్టిలో పెట్టుకొని రాసిన పాత్ర అది. ఐతే విజ‌య‌శాంతికి ప్ర‌స్తుతం రాజ‌కీయంగా అనుకూల ప‌రిస్థితులు లేని మాట నిజ‌మే ఐనా ఆమె త‌న క‌మ్‌బ్యాక్ మూవీకి పారితోషికం ఆషామాషీగా తీసుకోర‌నేది కూడా నిజ‌మే.

ఇంత‌కీ ఆమెకి ఎంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత ఒప్పుకున్నార‌నేది ఇపుడు డిస్క‌ష‌న్ పాయింట్ అయింది. మ‌హేష్‌బాబు త‌ర్వాత అంత స్టార్‌డ‌మ్ ఉన్న న‌టి ఈ సినిమా వ‌ర‌కు. మ‌రి ఈ సినిమా హీరోయిన్ క‌న్నా ఎక్కువే పారితోషికం ఇవ్వాలి ఆమెకి. మ‌రి ఇంత ఇవ్వ‌బోతున్నారో మేక‌ర్స్‌.