ఆ రీమేక్‌లో నేను న‌టించ‌ట్లేదు

I am not acting in Dear Comrade Bollywood remake: Vijay D
Wednesday, July 24, 2019 - 20:30

"డియ‌ర్ కామ్రేడ్‌"... బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. మంచి ఎమౌంట్‌కి అగ్ర నిర్మాత క‌ర‌ణ్ జోహ‌ర్ హ‌క్కుల‌ను తీసుకున్నాడు. క‌ర‌ణ్ జోహ‌ర్‌కి ప్ర‌త్యేకంగా షో వేసి చూపించాడు విజయ్ దేవ‌ర‌కొండ‌. అలాగే బాలీవుడ్ జ‌ర్న‌లిస్ట్‌ల‌కి ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చాడు. దాంతో క‌ర‌ణ్ జోహ‌ర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయ‌మైంది అని అంద‌రూ అంచ‌నాలు వేస్తున్నారు. కానీ విజ‌య్ దేవ‌రకొండ మాత్రం ఇపుడిపుడే బాలీవుడ్‌కి వెళ్లే ఆలోచ‌న‌లో లేడు.

డియ‌ర్ కామ్రేడ్ హిందీ రీమేక్‌లో తాను న‌టించ‌బోవ‌డం లేద‌ని ముందే క్లారిటీ ఇచ్చాడు. ఆ రీమేక్ వేరే బాలీవుడ్ హీరోతో క‌ర‌ణ్ జోహ‌ర్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. 

బాలీవుడ్‌లో న‌టించ‌మ‌ని ఆఫ‌ర్లు వ‌చ్చిన మాట నిజ‌మే కానీ ప్ర‌స్తుతం టాలీవుడ్‌పైనే ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్టాల‌నుకుంటున్న‌ట్లు తెలిపాడు. ఐతే సౌత్ మొత్తం మార్కెట్ పెంచుకోవాల‌నేది ప్లాన్ చేసుకుంటున్న మాట నిజ‌మేన‌ని అంగీక‌రించాడు.