ఈసారి నేను వేలు పెట్ట‌లేదు: నాని

I didn't involve this time, says Nani
Saturday, September 29, 2018 - 15:45

త‌ను న‌టించే ప్ర‌తి సినిమాలోనూ ఎక్కువ‌గా ఇన్‌వాల్వ్ అవుతాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఇది అందరికీ తెలిసిందే. ఆ విష‌యాన్ని నాని కూడా ఒప్పుకుంటాడు. కానీ "దేవ‌దాసు" సినిమా విష‌యంలో మాత్రం దానికి దూరంగా ఉన్నాడ‌ట‌. ఎందుకంటే ఈ సినిమాలో నాగార్జున కూడా న‌టించ‌డ‌మే. 

"నాగ్ ను కలవడానికి ముందు నా మైండ్ లో ఒకటే ఫిక్స్ అయ్యాను. సెట్ లో నాగ్ ముందు ఓవరాక్షన్ చేయకూడదని మాత్రం నిర్ణయించుకున్నాను. ఎందుకంటే, జనరల్ గా నా సినిమాల్లో నేను అన్ని పనులు చేసేస్తుంటాను. అసిస్టెంట్ డైరక్షన్ కూడా చేస్తుంటా. నాగ్ ముందు మాత్రం అలాంటి వేషాలు వేయకూడదు, బుద్ధిగా ఉండాలని ఫిక్స్ అయ్యానని ఇటీవ‌ల మీడియాకిచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో చెప్పుకొచ్చాడు నాని. 

"దేవ‌దాసు"కి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా, క‌లెక్ష‌న్లు మాత్రం బాగున్నాయి. మండే త‌ర్వాత దీని ఫ‌ర్‌ఫామెన్స్‌ని బ‌ట్టి ఈ సినిమా రేంజ్ ఏంట‌నేది తేలుతుంది. నాని ఒక 20 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాడ‌ట‌. ఆ త‌ర్వాత ద‌స‌రా సంద‌ర్భంగా జెర్సీ సినిమాని ప్రారంభించ‌నున్నాడు. "జెర్సీ" సినిమాలో మాత్రం పూర్తిగా ఇన్‌వాల్వ్ కానున్నాడు.