ఆ అనుభవాల గురించి అడగొద్దు: ఇలియానా

Ileana asks media not to ask about casting couch
Monday, November 12, 2018 - 18:15

హీరోయిన్లు అంద‌రూ ఇపుడు మీటూ గురించి స్పందిస్తున్నారు. కొంద‌రు త‌మ‌కి ఎదురైన లైంగిక వేధింపుల గురించి పూస‌గుచ్చిన‌ట్లు చెపుతున్నారు. కొంద‌రు త‌మ‌ని వేధించిన వారి పేర్ల‌ని బ‌య‌ట‌పెడుతున్నారు. మ‌రికొంద‌రు ఇత‌ర అమ్మాయిలు చేస్తున్న ఉద్య‌మానికి నైతిక మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. మొత్త‌మ్మీద ఈ వివాదం వ‌ల్ల సినిమా ఇండ‌స్ట్రీలో జ‌రుగుతోన్న లైంగిక వేధింపుల గురించి అంద‌రికీ ఒక అవ‌గాహ‌న వ‌చ్చింది.

ఐతే కొంద‌రు త‌మ‌కు మాత్రం అలాంటివి జ‌ర‌గ‌లేదు అని అంటున్నారు. ఈవిష‌యంలో ఇలియానా స్పందించిన తీరు కొంత భిన్నంగా ఉంది.

"కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి మాత్రం న‌న్ను అడగొద్దు. సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఐతే అవి వేధింపుల‌కింద‌కి వ‌స్తాయా?  లేదా>," అని చెప్ప‌లేను అంటోంది.

ఇంత‌కీ ఆమె క్యాస్టింగ్ కౌచ్‌కి గురైందా?