నాకు లైన్ వేస్తే యూజ్ ఉండదు!

Ileana chitchat about Big Bull
Wednesday, July 1, 2020 - 19:00

నన్ను ట్రై చేస్తే ఉపయోగం ఉండదంటోంది గోవా బ్యూటీ ఇలియానా. మరీ ముఖ్యంగా తనకు డేటింగ్ సలహాలు అస్సలు ఇవ్వద్దంటోంది. తను నటించిన "ది బిగ్ బుల్"అనే హిందీ సినిమా ఓటీటీ రిలీజ్ కు దగ్గరపడుతుండడంతో.. ఆమె నెటిజన్లతో ఛాట్ చేసింది. ఈ సందర్భంగా తనకు సంబంధించిన మరికొన్ని విశేషాల్ని షేర్ చేసుకుంది.

- ఫేవరెట్ కార్టూన్?
టామ్ అండ్ జెర్రీ.

- ప్రస్తుతం చేస్తున్న వర్కవుట్ ఏంటి?
ప్రస్తుతం ఆన్ లైన్ వర్కవుట్ ప్రొగ్రామ్ ఫాలో అవుతున్నాను. ఇది 80 రోజుల కార్యక్రమం. ప్రస్తుతం నా 6వ రోజు వర్కవుట్ నడుస్తోంది. ఇది చాలా కష్టంగా ఉంది కానీ బాగుంది. ఏమాత్రం తేడా కొట్టినా గాయాలు గ్యారెంటీ.

- మీ జుట్టు సీక్రెట్?
మా అమ్మ నుంచి వచ్చింది అది.

- ఇలియానా అంటే అర్థం ఏంటి?
అదొక గ్రీక్ పదం. సూర్యోదయం, ప్రకాశంవంతమైనది అని అర్థం. 

- పాటలు పాడతారా?
నేను పాటలు పాడగలననే అనుకుంటున్నాను. ఎందుకో ఈ మాట చెబుతుంటే సిగ్గేస్తోంది.

- ఎవరైనా మిమ్మల్ని లవ్ లో పడేయాలని ప్రయత్నిస్తుంటే ఏం చేస్తారు?
అందంగా ఉన్నంత వరకు ఓకే. అసభ్యంగా, చిరాగ్గా ఉంటే మాత్రం ఇద్దరికీ ఇబ్బందికరమే. అయినా నాకు ఎవ్వరూ డేటింగ్ సలహాలు ఇవ్వొద్దు. నాకు లైన్ వెయ్యాలనే ప్రయత్నం చెయ్యొద్దు... యూజ్ ఉండదు మీకు. 

- ఇంతకీ  సింగిలా లేక ఎవరైనా ఉన్నారా?
(ఇలా అడిగితెనే మండుద్ది..  అన్నట్లుగా కోపంగా, చిరాగ్గా ఉండే ఎమోజీ పెట్టి తన అసహనాన్ని చూపించింది.)