ఇలియానా బొద్దుగా మారుతోందా?

Ileana putting on weight?
Monday, November 5, 2018 - 15:30

స్లిమ్‌నెస్‌కి సినానోమ‌స్‌గా అనే పేరు ఉండేది ఇలియానాకి. సైజ్‌జీరో అందాల‌తో కిరాకు పుట్టించేది. ఐతే ఇపుడు ఆమె కూడా బొద్దుగా మారుతోంది. గ‌తేడాది పెళ్లి చేసుకొంది. ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూని పెళ్లాడింది. పెళ్లి త‌ర్వాత ఈ భామ కొంత బ‌రువు పెరిగింది.

ముఖ్యంగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమాకి సంబంధించిన స్టిల్స్ అన్నింటిలోనూ ఆమె చాలా లావుగా క‌నిపిస్తోంది. స్లిమ్‌నెస్ లేదు. తెలుగులో ఆరేళ్ల త‌ర్వాత ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమెకిపుడు 31 ఏళ్లు.