గొప్ప న‌టుడే కానీ చీక‌టి కోణ‌మూ ఉంది!

imple Kapadia talked about Nana Patekar's Dark Side, old video goes viral
Tuesday, October 2, 2018 - 20:00

నానా ప‌టేక‌ర్ గొప్ప న‌టుడే కానీ అత‌ను అబ్‌నాక్సియ‌స్ ప‌ర్స‌న్ (అస‌హ్యంచుకునే) అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది ఒక‌ప్ప‌టి అందాల తారామ‌ణి డింపుల్ క‌పాడియా. నానా ప‌టేక‌ర్ ఇపుడు వార్త‌ల్లో ఉన్నారు. త‌నుశ్రీ ద‌త్తాని 2008లో వేధించారు అన్న ఆరోప‌ణల‌ను ఎదుర్కొంటున్నారు. ఆయ‌న లైంగిక వేధింపులు భ‌రించ‌లేక హార్న్ ఓకే ప్లీజ్ అనే సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు తను శ్రీ ద‌త్తా ఆరోపించింది. ఆమె ఆరోప‌ణ‌ల‌కి బాలీవుడ్ తారామ‌ణుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

నానా ప‌టేక‌ర్‌తో ప‌లు సినిమాల్లో న‌టించిన డింపుల్ క‌పాడియా.. ఆయ‌న గురించి చెప్పిన ఒక పాత వీడియో ఇంట‌ర్వ్వూ ఇపుడు వైర‌ల్ అవుతోంది. 

"నానా పాటేకర్ గొప్ప నటుడే. కానీ అతడి జీవితంలో ఓ చీకటి కోణం కూడా ఉంద. అత‌నిలో చాలా చెడు కూడా ఉంది. అతడి న‌ట‌న చూస్తే... వంద హత్యలు చేసినా క్షమించాలి అనిపిస్తుంది. నా ప్రాణం కూడా తీసుకో అని అత‌నికి చెప్పాల‌నిపిస్తుంది కానీ అత‌నిలోని బ్యాడ్ క్వాలిటీ మాత్రం క్ష‌మించ‌రానిది. నాతో బాగానే ప్ర‌వ‌ర్తించాడు కానీ ఇతరుల‌తో అత‌ని ప్ర‌వర్త‌న చాలా ద‌గ్గ‌రి నుంచి చూశాను కాబ‌ట్టి ఈ మాట చెపుతున్నా," అని తెలిపింది డింపుల్ క‌పాడియా.