ఇస్మార్ట్ శంక‌ర్ గోవా టూర్‌

iSmart Shankar to head to Goa
Thursday, February 28, 2019 - 20:00

రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. హీరోల‌ను మాస్ యాంగిల్‌లో స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసే డైరెక్ట‌ర్ పూరి.. రామ్‌ను కూడా స‌రికొత్త లుక్‌లో చూపిస్తున్నారు. 30రోజుల పాటు హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించారు.

టోట‌ల్ యూనిట్ గోవా వెళుతుంది. అక్క‌డ మ‌రో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు డైరెక్ట‌ర్ పూరి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. చిత్రంలో నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.