బోనాల బ్యాటింగ్ కూడా ఇస్మార్ట్ దే

iSmart Shankar takes advantage of Bonalu
Monday, July 29, 2019 - 15:00

బోనాల పండుగ ముగిసింది. కానీ తెలంగాణ గవర్నమెంట్ సోమవారం స్కూళ్లకి సెలవులు ప్రకటించింది. అంటే హైదరాబాద్ లో  సోమవారం కూడా హాలీడేనే. మరి ఈ రోజు హాలీడే బెనిఫిట్ ని డియర్ కామ్రేడ్  పొందే అవకాశం ఉందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ మార్నింగ్ షో కలెక్షన్లు చూస్తే ఆ బెనిఫిట్ ని ఇస్మార్ట్ శంకర్ లాగేసుకున్నాడు. సింగిల్ స్క్రీన్లలో ఇస్మార్ట్ శంకర్ బ్యాటింగ్ ఇంకా ఆగట్లేదు.

అన్నట్లు ఇస్మార్ట్ శంకర్ లో బోనాల పాట కూడా ఉంది. సో.. అది కూడా ఈ సినిమాకి అడ్వాంటేజే.

మల్టీప్లెక్స్లలో మాత్రం డియర్ కామ్రేడ్ సందడి ఉంది. ఈ సినిమాకి పెద్ద మైనస్ స్లో నేరేషన్, లెంగ్. ఇప్పటికే 13 నిమిషాలు కట్ చేశారు. సో... ఇపుడు కొంచెం బెటర్ గా  ఉండే అవకాశం ఉంది. ఐతే డ్యామేజ్ జరగకముందే డియర్ కామ్రేడ్ జాగ్రత్త వహించి ఉoటే బాగుండేది. క్రేజ్ ఉన్న సినిమాకి రన్నింగ్ టైమ్ బ్యాడ్ అయిపోయింది.