ఇస్మార్ట్‌కి ఓపెనింగ్స్ అదుర్స్‌

iSmart Shankar takes bumper openings
Thursday, July 18, 2019 - 22:45

పూరి జ‌గ‌న్నాథ్ ప‌ని అయిపోయింద‌ని చాలా కాలంగా కామెంట్స్ వ‌స్తున్నాయి. ఎందుకంటే ఆయ‌న ఫామ్ అలా ఉంది. టెంప‌ర్ త‌ర్వాత అర‌డ‌జ‌న్ ఫ్లాప్స్ తీశాడు. దాంతో పూరి తీసిన కొత్త సినిమా "ఇస్మార్ట్ శంక‌ర్‌"కి భారీ ఓపెనింగ్స్ ఉంటాయ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. బీసీ సెంట‌ర్ల‌లో కొంత హ‌డావుడి ఉంటుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు త‌ప్ప హైద‌రాబాద్‌లాంటి ఏ సెంట‌ర్ల‌లో భారీ ఓపెనింగ్స్ అస్స‌లా ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు.

తొలి రోజు అంద‌రి అంచ‌నాల‌ను మించి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకొంది. చాలా కాలంగా స‌రైన మాస్ సినిమా లేక‌పోవ‌డంతో పూరి తీసిన ఈ ఊర‌మాస్ సినిమాకి ఫ‌స్ట్‌డే అదుర్స్ అన్న రీతిలో క‌లెక్ష‌న్స్ ద‌క్కాయి. ఇస్మార్ట్ శంక‌ర్ ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత ఏ మేర‌కు నిల‌బ‌డుతాడు అనేది చూడాలి. ఐతే తొలి వీకెండ్ మాత్రం పూరికి ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన బెస్ట్ ఓపెనింగ్ కానుంది. చాలా ఏరియాస్‌లో నార్మ‌ల్ రేట్‌ల‌కే అమ్మారు. సో... ల‌క్ కుదిరితే... తొలి వీకెండే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ స్థితికి రావ‌చ్చ‌ని అంటున్నారు. 

ఈ భారీ ఓపెనింగ్ చూసి పూరి క‌న్నా వ‌ర్మ ఎక్కువ హ‌డావుడి చేస్తున్నాడు సోష‌ల్ మీడియాలో. దీనికి సీక్వెల్ తీయ‌మ‌ని వ‌ర్మ పూరిని కోరాడు. పూరి త‌న స్ట‌యిల్‌లో ఆల్రెడీ టైటిల్ రిజిష్ట‌ర్ చేశాన‌ని రిప్ల‌యి ఇచ్చాడు. దానికి డ‌బుల్ స్మార్ట్ అని పేరు పెట్టాడ‌ట‌. అలా ఉంది పూరి క్యాంప్ జోష్‌.