జ‌గ‌ప‌తి బాలీవుడ్ లుక్ అదుర్స్‌

Jagapathi Babu in Ajay Devgan's Tanaji
Tuesday, September 4, 2018 - 14:45

జ‌గ‌ప‌తిబాబు ఇప్ప‌టికే త‌మిళంలో, మ‌ల‌యాళంలో, క‌న్న‌డంలో విల‌న్‌గా మెప్పించాడు. కోలీవుడ్‌లో ర‌జ‌నీకాంత్‌, విజ‌య్ వంటి సూప‌ర్‌స్టార్స్ సినిమాల్లో విల‌న్‌గా న‌టించాడు. ఇక మ‌ల‌యాంలో మోహ‌న్‌లాల్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ పులిమురుగ‌న్‌లో క‌నిపించాడు. క‌న్న‌డంలోనూ జాగ్వార్ వంటి చిత్రాల్లో ప్రతినాయ‌కుడిగా అద‌ర‌గొట్టాడు.

ఇపుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అజ‌య్ దేవ‌గ‌న్ రూపొందిస్తున్న భారీ చారిత్ర‌క చిత్రం 'తానాజీ' లో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అజయ్ దేవగన్ ఏరికోరి జ‌గ‌ప‌తిబాబుని తీసుకున్నాడ‌ట ఈ పాత్ర‌కి. త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది ఈ మూవీ. జ‌గ‌ప‌తిబాబుకి ఈ గెట‌ప్ ఎలా ఉంటుందో అని టెస్ట్ చేసి చూశారు. లుక్ అదిరిపోవ‌డంతో ఓకే చేశారు జ‌గ‌ప‌తిని.