జాన్వీ కూడా బికినీ షో చేస్తుందా?

Jahnvi Kapoor to do bikini act in Dostana 2?
Thursday, June 27, 2019 - 23:15

శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ కి మ‌రో సూప‌ర్ ఆఫ‌ర్‌ ద‌క్కింది. ఆమెని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేసిన నిర్మాత క‌ర‌ణ్ జోహ‌ర్ ఆమెకి మ‌రో అద్భుత‌మైన ప్రాజెక్ట్ అప్ప‌చెప్పాడు. క‌ర‌ణ్ జోహ‌ర్ నిర్మించిన సినిమాల్లో మంచి హిట్ మూవీ..."దోస్తానా". అభిషేక్ బ‌చ్చ‌న్‌, జాన్ అబ్ర‌హం, ప్రియాంక చోప్రా న‌టించిన మూవీ అది. ఆ సినిమాకి ఇపుడు సీక్వెల్ నిర్మిస్తున్నాడు క‌ర‌ణ్ జోహ‌ర్‌. "దోస్తానా 2" సినిమాలో జాన్వీ మెయిన్ హీరోయిన్‌. "దోస్తానా" సినిమాలో ప్రియాంక చోప్రా న‌టించింది. ఇపుడు ఈ సీక్వెల్‌లో జాన్వీ హీరోయిన్‌. 

ఆర్య‌న్ కార్తీక్ హీరోగా న‌టించనున్నాడు. మ‌రో పాత్ర‌లో కొత్త యాక్ట‌ర్ ప‌రిచ‌యం కానున్నాడు. 

దోస్తానా సినిమాలో ప్రియాంక చోప్రా బికినీ షో అందాలు ఎంతో పాపుల‌ర్‌. మ‌రి జాన్వీ కూడా టూ పీస్‌లో కుర్ర‌కారుకి క‌నువిందు చేస్తుందా? ఇదే ఇపుడు అంద‌రి మ‌దిలో మెదిలో ప్ర‌శ్న‌. ఆమె ఆఫ్‌స్ర్కీన్‌లో చాలా ఎక్స్‌పోజింగ్ చేస్తుంటుంద‌ట‌. గూగుల్ సెర్చ్‌చేస్తే ఆమె బికినీ ఫోటోలు కూడా ద‌ర్శ‌న‌మిస్తాయి. ఐతే వెండితెర‌పై టూపీస్ షోకి ఉండే కిక్కే వేరు. కుర్ర‌కారు ఫిదా అయ్యే సీన్ అది. క‌లెక్ష‌న్స్‌కి ఊపు తెస్తుంది. 

మ‌రో జాన్వీ మ‌రో గ్లామ్ ఐకాన్ అవుతుందా "దోస్తానా 2"తో?