జామురాతిరి జాబిలమ్మ వెర్సన్‌ 2.0

Jamuratiri Jabilamma rekindled
Tuesday, August 13, 2019 - 18:45

రాంగోపాల్‌ వర్మ తీసిన గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచింది "క్షణక్షణం". "శివ సినిమా కన్నా "క్షణక్షణం" సినిమానే ఎక్కువ మంది చూశారు టీవీల్లో.  ఈ సినిమాతోనే మ్యూజిక్‌ డైరక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎం.ఎం.కీరవాణి. ఆ తర్వాత ఆయన 200కి పైగా సినిమాలకి పాటలు అందించారు. వర్మ ఇపుడు తీస్తున్న సినిమాలని కానీ, ఆయన సినిమాల్లోని ఇప్పటి పాటలు కానీ చూసినపుడు... ఆయన టేస్ట్‌కి ఏమైంది అనిపిస్తుంది. "క్షణక్షణం", "రంగీలా", "గాయం", "దౌడ్‌", "సత్య" వంటి సినిమాల్లో పాటలు ఆయనే చేయించుకున్నాడా అన్న డౌట్స్‌ కూడా వస్తాయి. అంత గొప్పగా ఉండేవి ఆయన సినిమాల్లో ఒకపుడు పాటలు.

క్షణక్షణం సినిమాలో ఎవర్‌గ్రీన్‌ హిట్‌ సాంగ్‌... "జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా". వెంకటేష్‌, శ్రీదేవిలపై చిత్రీకరించిన ఈ పాటకి సిరివెన్నెల సాహిత్యం అందించారు. బాలు, చిత్ర మధురంగా పాడారు. 30 ఏళ్ల తర్వాత ఈ పాటని కీరవాణి కొడుకు, ఇతర గాయకులు సరికొత్తగా పాడి ... ఆ పాటని చిత్రీకరించారు. అమెరికాలోని సాన్ఓస్‌ అడవుల్లో ఈ కుర్రకారు అంతా పాడి, షూట్‌ చేశారు. ఇది 2.0 వెర్సన్‌ అన్నమాట.

కొత్త పాట బాగుందా, పాత పాటా?