తెలంగాణ‌లో పోటీపై రెండ్రోజుల్లో నిర్ణ‌యం!

Jana Sena president Pawan Kalyan about Telangana polls
Saturday, November 10, 2018 - 14:45

డిసెంబ‌ర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇవి ముంద‌స్తు ఎన్నిక‌లు. ఇంత ముంద‌స్తుగా ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ఊహించ‌ని జ‌న‌సేన ఇపుడు పోటీ ప‌డేందుకు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీప‌డ‌ద‌నేది ఖాయంగా తెలుస్తోంది. ఐతే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదంటున్నారు.  పార్టీలో చర్చించి రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఐతే త‌మ పార్టీ ప్ర‌ధానంగా ఫోక‌స్ ఏపీపైనే పెడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కి పూర్తిగా రెడీగా ఉన్నామ‌ని అంటున్నారు.

షెడ్యూల్ ప్ర‌కారం వచ్చే ఏడాది వేస‌విలోనే ఎన్నికలు జ‌రిగి ఉంటే 23 స్థానాల్లో పోటీ చేయాలని ముందుగా అనుకున్నామని చెప్పారు ప‌వ‌ర్‌స్టార్‌. కానీ ఇపుడు సీన్ మార‌డంతో తాము సైలెంట్‌గా ఉన్నామ‌న్నారు. ఐతే కొంత మంది స్వతంత్రంగా నిలబడుతామ‌ని, తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారట‌. సో... వీటన్నింటిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పవన్‌ స్పష్టం చేశారు.