జాహ్న‌వి బికినీ షో నిజం కాదు

Janhvi Kapoor not to appear in bikini
Tuesday, August 21, 2018 - 17:30

శ్రీదేవి కూతురు జాహ్న‌వి కూడా బికినీ షో మొద‌లు పెట్ట‌నుందని రీసెంట్‌గా తెగ ప్ర‌చారం జ‌రిగింది. ఎందుకంటే ఆమెని "దోస్తానా 2" సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహ‌ర్ నిర్మించిన దోస్తానా సినిమా ఒక ట్రెండ్ సెట్ట‌ర్‌. ఇండియ‌న్ సినిమాల్లో గే కామెడీని పాపుల‌ర్ చేసింది. ఆ సినిమాలో ప్రియాంక చోప్రా బికినీ షోతో అద‌ర‌గొట్టింది.

ఇపుడు ప్రియాంక స్థానంలో జాహ్న‌వి వ‌చ్చి చేరింద‌నీ, ఆమె కూడా బికినీ అందాల‌ను ప‌ర‌చ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. మీడియా ఈ వార్త‌ల‌తో హోరెత్తించింది. దాంతో వెంట‌నే క‌ర‌ణ్ జోహ‌ర్ స్పందించాడు. "దోస్తానా 2" గురించి సాగుతున్న ఊహాగానాల్లో నిజం లేదు. ఎంతో ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులో ఒక్క‌టీ కూడా నిజం కాద‌ని క్లారిటీ ఇచ్చాడు క‌ర‌ణ్ జోహ‌ర్‌.

క‌ర‌ణ్ జోహ‌ర్ నిర్మించిన "ధ‌డ‌క్" సినిమాతోనే శ్రీదేవి కూతురు అర‌గేంట్రం చేసింది. తొలి సినిమా సూప‌ర్‌హిట్‌. అలాగే ఇపుడు క‌ర‌ణ్ జోహ‌ర్ డైర‌క్ట్ చేస్తున్న "త‌క్త్" అనే సినిమాలోనూ ఆమె ఒక హీరోయిన్‌గా న‌టిస్తోంది. మూడో సినిమా కూడా ఆయ‌నే నిర్మిస్తున్నానేది టాక్‌. కానీ ఈ ప్ర‌చారానికి ఆయ‌నే ఎండ్‌కార్డ్ వేశాడు.