ఛీ...డ్రాయిర్‌తో ప్ర‌చార‌మేంటి?

JD Chakravarthy removes pant for Hippi promotions
Wednesday, June 5, 2019 - 15:00

"హిప్పీ" సినిమా ఈ వీకెండ్ విడుద‌ల అవుతోంది. ఎంత చేసిన సినిమాకి బ‌జ్ రాలేదు. "ఆర్ ఎక్స్ 100" హీరో కార్తీకేయ న‌టించిన మూవీ ఇది. ప్ర‌చారం కోసం హిప్పేసుకొని తిరుగుదామ‌నుకున్నారు హీరో కార్తీకేయ‌, సినిమాలో కీల‌క పాత్ర పోషించిన జె.డి.చ‌క్ర‌వ‌ర్తి. హిప్పీ హీరో కార్తీకేయ త‌న కండ‌ల‌ను చూపించేలా ష‌ర్ట్ విప్పడం వ‌ర‌కు ఓకే కానీ జె.డి ఏకంగా ప్యాంట్ విప్పేసి డ్రాయ‌ర్ మీద కెమెరాకి ఫోజ్ ఇచ్చాడు. సినిమా ప్ర‌చారాన్ని బూతు మాట‌ల నుంచి డ్రాయ‌ర్ వ‌ర‌కు తీసుకొచ్చారు నేటి త‌రం మేక‌ర్స్‌, యాక్ట‌ర్స్‌.

ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా హీరో కార్తీకేయ‌, జెడి ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. యాంక‌ర్ హిప్పి అంటే ఏంటి అని అడిగితే...కార్తీకేయ ష‌ర్ట్ విప్పి హిప్పీ అన్నాడు. త‌నకి పొట్ట ఉంద‌ని ష‌ర్ట్ విప్ప‌లేన‌ని జెడి ప్యాంట్ విప్పి డ్రాయ‌ర్ మీద నిల్చున్నాడు. ఇది వీరి పబ్లిసిటీ పైత్యం.