10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌

Jeevitha Rajasekhar contribute Rs 10 lakh towards Cyclone Titli victims
Wednesday, October 24, 2018 - 10:45

ఇటీవ‌ల తిత్లీ తుపాను కార‌ణంగా శ్రీకాకుళం జిల్లాలోని 165 గ్రామాలు స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నాయి. జ‌న జీవ‌నం అస్త‌వ్య‌స్థ‌మైంది. ఆస్థి న‌ష్టం ఎక్కువ‌గా జ‌రిగింది. ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. త‌మ వంతుగా సినీ ప‌రిశ్ర‌మ బాధితుల‌కు ఆప‌న్న హస్తాన్ని అందించ‌డానికి ముందుకు వ‌చ్చింది. అందులో భాగంగా హీరో రాజ‌శేఖ‌ర్‌, ఆయ‌న స‌తీమ‌ణి జీవిత తుపాను బాధితుల‌కు రూ.10 ల‌క్ష‌లు విరాళాని్న‌  అందించారు. ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి అమ‌రావ‌తిలోని ఆయ‌న స్వ‌గృహంలో రూ.10 ల‌క్ష‌ల చెక్‌ను అందించారు.

సాయం అందించ‌డంలో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ఎపుడూ ముందుంటారు. 

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని ప‌లువురు తార‌లు ఇప్ప‌టికే విరాళాల‌ని ప్ర‌క‌టించారు. సంపూర్ణేష్‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అల్లు అర్జున్‌, బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌, నిఖిల్‌, రానా, వ‌రుణ్ తేజ‌... ఇలా పలువురు త‌మ వంతు ఆర్థిక‌, వ‌స్తు సాయం అందంచారు. రామ్‌చ‌ర‌ణ్ ఒక గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోనున్నాడు.