‘జోడి’ ఫస్ట్ లుక్ విడుదల

Jodi first look released
Saturday, April 6, 2019 - 15:30

ఆది సాయికుమార్ లేటెస్ట్ గా మరో సినిమాతో రాబోతున్నాడు. కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. "జోడి" అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఉగాది పండగ సందర్భంగా జోడి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.

యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోంది ఈ జోడి. గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జోడీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.