అలీకి, ల‌లితా గుండుబాస్‌కి లింకేంటి?

Joke on Ali, link with Gundu Boss
Tuesday, March 12, 2019 - 15:30

పదివేల కోట్లరూపాయల స్వర్ణ సామ్రాజ్యానికి అధినేతగా ఎదిగిన కిర‌ణ్‌కుమార్ పేరు చాలామందికి తెలియ‌దు. కానీ లలిత జ్యుయ‌ల‌రీస్ గుండుబాస్ అంటే అంద‌ర‌కీ అర్థ‌మ‌వుతుంది. ఆయ‌నే మోడ‌ల్‌గా న‌టించిన జ్యుయ‌ల‌రీ యాడ్ చాలా పాపుల‌ర్ అయింది. మా షాప్‌లో కొనేముందు మూడు నాలుగు చోట్లా క‌నుక్కొని, ధ‌ర భేరీజు వేసుకొని రండి అని చెప్పిన యాడ్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. డ‌బ్బులు ఊరికే రావు క‌దా అనే ఆయ‌న పంచ్‌లైన్ కూడా అదిరింది.

ఇపుడు మ‌న టాలీవుడ్ క‌మెడియ‌న్‌కి గుండుబాస్ ప్రేర‌ణ అయ్యాడ‌నే జోక్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఎందుకంటే ఆలీ... మొద‌ట జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ప్ర‌యాణం చేశాడు. ఆ త‌ర్వాత తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుని ట‌చ్ చేశాడు. ఫైన‌ల్‌గా వైఎస్ఆర్సీలో చేరాడు.

దాంతో ఈ కింది జోక్ బాగా స‌ర్క్య‌లేట్ అవుతోంది.

లలితా జ్యూవెలరీ గుండుబాస్ చెప్పింది ఎవరైనా ఫాలో అయ్యారో లేదో తెలియదు కానీ నటుడు అలీ మాత్రం బాగా ఫాలో  అయ్యాడు.

టీడీపీ, జనసేన, వైసీపీ.. మూడు పార్టీలకు వెళ్లి చూసి ఫొటో తీసుకుని ఎస్టిమేట్లు పోల్చుకొని వైసీపీలో చేరాడు.

నటన ఊరికే రాదు!