త‌మిళ రాజ‌కీయాల్లోకి జ్యోతిక‌ అరంగేట్రం?

Jyothika to enter into Tamilnadu politics
Wednesday, June 26, 2019 - 22:30

జ్యోతిక‌కి కూడా రాజకీయాల‌పై ఆస‌క్తి ఉందా? అవున‌నే అనిపిస్తోంది ఆమె తాజా మాట‌ల‌ను బ‌ట్టి. త‌మిళ హీరో సూర్య‌ని పెళ్లి చేసుకున్న త‌ర్వాత హోమ్ మేక‌ర్ పాత్ర‌కే ఎక్కువ‌గా ప‌రిమితం అయింది జ్యోతిక‌. ఐతే జ్యో ఇటీవ‌ల మ‌ణిర‌త్నం సినిమా స‌హా ప‌లు సినిమాల్లో న‌టించి మ‌ళ్లీ బిజీ అయింది. 

ఇపుడు సోష‌ల్ వ‌ర్క్‌లోనూ యాక్టివ్‌గా మారింది. ఐతే సాప్ట్ స్పోకెన్ విమెన్ అని పేరు తెచ్చుకున్న జ్యోతిక రీసెంట్‌గా అప‌ర‌కాళిక‌లా ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించింది. దాంతో ఆమె చూపు కూడా రాజ‌కీయాల వైపు ఉందా అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి.

"త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ పాఠాలల్లో కనీస సదుపాయాలు లేవు.నెలల పాటు,  సంవత్సరాల పాటు టీచర్లు విధులకు రావడం లేదు. రాష్ట్రంలో 35 శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠ‌శాలలో చదువుకుంటున్నా.... స‌దుపాయాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. నీట్ విధానంలో అనేక లోపాలున్నాయి.. వాటిని సరి చేయాలి.. వ‌స‌తులు క‌ల్పించాలి."  ఇలా ఘాటుగా విమ‌ర్శ బాణాలు ఎక్కుపెట్టింది జ్యోతిక‌. దాంతో ఆమె వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కి రెడీ అవుతుందా అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. కానీ ఆమె తాజాగా పేర్కొన్న స‌మ‌స్య‌లు, అంశాల‌తోనే రాక్ష‌సి అనే సినిమా రూపొందింది. ఆ సినిమాలో జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ధారి.

త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇలా మాట్లాడింది త‌ప్ప ఆమెకి రాజ‌కీయాల్లోకి అరంగేట్రం చేసే ఆలోచ‌న లేద‌ని జ్యోతిక పీ.ఆర్ మేనేజ‌ర్ అంటున్నారు.