5 ప్రశ్నలు: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal about her quarantine life
Tuesday, April 28, 2020 - 12:15

అందరు హీరోయిన్లలానే కాజల్ కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైంది. తనకు నచ్చిన పనులు చేసుకుంటూ కాలం గడిపేస్తోంది. అయితే బోర్ కొట్టకుండా ఫుల్ బిజీగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ క్వారంటైన్ టైమ్ లో ఆన్ లైన్లోకి వచ్చిన కాజల్ తో టాప్-5 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్

1. రోజు ఎలా గడుస్తోంది?
షూటింగ్ టైమ్ లో ఎలా ఉంటానో లాక్ డౌన్ టైమ్ లో కూడా అంతే బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. మార్నింగ్ లేచి యోగా, ఎక్సర్ సైజ్ చేస్తున్నాను. ఆన్ లైన్ లో కొన్ని న్యూరో ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ లాంటి క్లాసులు నేర్చుకుంటున్నాను. ఛెస్ నేర్చుకుంటున్నాను. భగవద్గీత చదువుతున్నాను. భాగవతం వింటున్నాను. కొత్త వంటలు ట్రై చేస్తున్నాను. ఇలా రోజంతా బిజీగా ఉంటున్నాను.

Also Read: 5 క్వశ్చన్స్: రాశిఖన్నా

2. ఎక్కువగా ఏం చూస్తున్నారు?
ఈ క్వారంటైన్ టైమ్ లో నెట్ ఫ్లిక్స్ లో ఫవుదా (Fauda) అనే సిరీస్ లో కొన్ని ఎపిసోడ్స్ చూశాను. చాలా బాగుంది. మనీ హెయిస్ట్ (Money Heist) కూడా చూస్తున్నాను. వీటితో పాటు "క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు" (Crash Landing on You) అనే కొరియన్ షో చూస్తున్నాను. ఈ షోకు అడిక్ట్ అయిపోయాను. చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడాలి.

3. ఏ పుస్తకాలు చదువుతున్నారు?
ఒకేసారి 3-4 పుస్తకాలు చదవడం నాకు ఇష్టం. చదివిన పుస్తకాలే చదువుతుంటాను. ఫారెస్ట్ ఆఫ్ ఎన్ ఛాంట్ మెంట్స్ అనే పుస్తకం ఎన్నిసార్లు చదివానో నాకే తెలీదు. ఆ పుస్తకమే ఇప్పుడు మళ్లీ చదువుతున్నాను. దీంతోపాటు One Hundred Years of Solitude అనే పుస్తకం కూడా చదువుతున్నాను.

Also Read:5 క్వశ్చన్స్: హెబ్బా పటేల్

4. కొంత వంటలు ఏమైనా ట్రై చేస్తున్నారా?
ఈ లాక్ డౌన్ టైమ్ లో కొత్తకొత్త వంటకాలు ట్రై చేస్తున్నాను. కానీ ఏది ట్రై చేసినా అంతా హెల్దీగా ఉండేలా చూసుకోవడం నా స్పెషాలిటీ. ఇక వంటకు సంబంధించిన బేసిక్స్ పక్కనే అమ్మ చెబుతూ ఉంటుంది. ఎక్కువగా ఇటాలియన్ వంటకాల్ని ఇంట్లో ట్రై చేస్తుంటాను. బేకింగ్స్ ఎక్కువగా ఇష్టం.

Also Read: జల్దీ 5 విత్ ఈషా రెబ్బ

5. లాక్ డౌన్ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?
లాక్ డౌన్ తర్వాత ప్రపంచం చాలా శుభ్రంగా ఉంటుందని అనిపిస్తోంది. ప్రజలు మరింత శుభ్రంగా ఉంటారు. కుటుంబ బంధాలు మరింత పెరుగుతాయి. కొంతమందికి డబ్బు విలువ కూడా తెలుస్తుంది. నేను అనుకోవడం చాలామంది ప్రజల ఆలోచన విధానం మారుతుంది. లాక్ డౌన్ తర్వాత చాలామంది డబ్బు కోసం కాకుండా, బంధాల కోసం బతుకుతారని అనిపిస్తోంది.

Also Read: నిధి అగర్వాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్