కాజల్.. లిస్ట్ లో ఆ ఇద్దరు

Kajal Aggarwal finalises two directors
Saturday, July 13, 2019 - 15:00

నిర్మాతగా మారబోతున్న విషయాన్ని కాజల్ ఇప్పటికే స్పష్టంచేసింది. కేఏ వెంచర్స్ అనే టైటిల్ తో ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించబోతున్నానని గతంలోనే చెప్పింది. ఇప్పుడా దిశగా అడుగులు వేస్తోంది కాజల్. ఓ మంచి సబ్జెక్ట్ దొరికితే, అందులో తనే నటిస్తూ నిర్మించే ఆలోచనలో ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా ఇద్దరు దర్శకుల్ని ఫైనల్ చేసింది. 

కాజల్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ డైరక్టర్ తేజ. ఇప్పటికే తన ప్రొడక్షన్ గురించి తేజతో డిస్కస్ చేసిన కాజల్.. తన ఫేవరెట్ డైరక్టర్ తో కలిసి మరో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతానికైతే ఇద్దరూ కలిసి ఓ లైన్ పై వర్కవుట్ చేశారు. అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చెప్పలేం.

మరోవైపు దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా చర్చలు జరుపుతోంది కాజల్. అ! సినిమాతో కాజల్ ను ఎట్రాక్ట్ చేశాడు ప్రశాంత్. అతడితో కూడా తన నిర్మాణ సంస్థ గురించి చర్చించింది. ఈ మేరకు కాజల్-ప్రశాంత్ మధ్య కూడా స్టోరీ డిస్కషన్లు నడిచాయి. 

అటు తేజ, ఇటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ నిర్మాతగా మారే అవకాశం ఉంది. అయితే తన బ్యానర్ పై కమర్షియల్ సినిమాలు తీయనని, పూర్తిగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలే నిర్మిస్తానని కాజల్ ప్రకటించింది. సో.. ఈ ఇద్దర్లో ఎవరు ముందుగా కాజల్ ను ఇంప్రెస్ చేస్తారో చూడాలి.