కొన్ని ఆగాయి...కొన్ని వాయిదా ప‌డ్డాయి

Kajal Aggarwal movies in trouble
Tuesday, April 30, 2019 - 18:00

కాజల్ అగర్వాల్ కి టైమ్ కలిసి రావడం లేదు. ఆమె నటించిన పలు సినిమాలు విడుదలకి రెడీ అయిన టైమ్‌లో వాయిదా పడ్డాయి. తేజ దర్శకత్వంలో రూపొందిన "సీత" షూటింగ్ పూర్తి చేసుకొని చాలా కాలమే అవుతోంది. ఏప్రిల్ చివర్లో విడుదల కావాల్సిన ఈ మూవీ మే నెలాఖరుకి వాయిదా పడింది.

ఇక శర్వానంద్‌తో ఆమె నటించిన సినిమాకి ఇంతవరకు పేరు కూడా ఫిక్స్ కాలేదు. ఎపుడు రిలీజ్ అవుతుందో కూడా తెలీదు.
ఇక ఆమె తమిళంలో ఎంతో ఆర్బాటంగా ఒప్పుకున్న "భారతీయుడు 2" సినిమా.. ఒక పెడ్యూల్ పూర్తి చేసుకొని ఆగిపోయింది. బడ్జెట్ సమస్యల కారణంగా.. "భారతీయుడు 2" సినిమా ఉంటుందా లేదా అన్నది ఇప్పటికీ డౌటే.

తమిళంలోనే ఆమె నటించిన "పారిస్ పారిస్" (బాలీవుడ్లో హిట్టయిన "క్వీన్" సినిమాకి రీమేక్) సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొంది. విడుదలకి నోచుకోవడం లేదు.

ఇలా ఉంది కాజల్ అగర్వాల్ కొత్త సినిమాల సీన్.