పెళ్లి మాట పక్కన పెట్టిందా?

Kajal Aggarwal postpones wedding thoughts
Friday, April 24, 2020 - 23:15

ఆ మధ్య కాజల్ పెళ్లి గురించి బోలెడు చర్చ జరిగింది. ఎన్నో వార్తలు. ఆమె కట్టుకోబోయే వాడి గురించి మరెన్నో ప్రచారాలు. ఇప్పుడు అవన్నీ బంద్ అయ్యాయి. మరోసారి హీరోయిన్ గా బిజి అవుతోంది కాజల్ అగర్వాల్. చిరంజీవి నటిస్తోన్న "ఆచార్య" సినిమా సైన్ చేసింది. తమిళ్ లో "ఇండియన్ 2" ఎలాగూ ఉంది. వెంకటేష్ కొత్త సినిమాలో కూడా కాజల్ ని అడుగుతున్నట్లు సమాచారం. సో.. కెరీర్ మళ్ళీ పుంజుకుంటోంది. దాంతో ఆమె వెడ్డింగ్ మాట సైడ్ ఇచ్చుకోంది. 

కాజల్ కి ఇప్పుడు 34 ఏళ్ళు. ఆమె చెల్లెలు నిషా ఇప్పటికే పెళ్లి చేసుకొని ఓ పిల్లాడ్ని కనింది. అందుకే... కాజల్ కి ప్రెజర్ ఉంది. ఐతే... కెరీర్ ఇంకా నడుస్తున్నప్పుడు ఎందుకు తొందరపడి స్పాయిల్ చేసుకోవాలనేది మరో ఆలోచన. అందుకే పెళ్లి థాట్ ని పక్కకి నెట్టేసిందంట. 

ఐతే, ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్  అయింది అన్న పుకారు మాత్రం ఇంకా ఆగడం లేదు.