కోటిన్నరకి ఒప్పుకొంది!

Kajal Aggarwal signs Acharya for this remuneration
Thursday, March 19, 2020 - 14:00

కాజల్ అగర్వాల్ కొండెక్కి కూచొంది. కానీ కొండ దిగిరాక తప్పలేదు. ఈ మేటర్ అంతా ...మెగాస్టార్ "ఆచార్య" గురించే. 

"ఆచార్య" సినిమా నుంచి త్రిష తప్పుకోగానే కాజల్ అగర్వాల్ ని అప్రోచ్ అయింది టీం. కాజల్ రెండు కోట్లపైనే డిమాండ్ చేసింది. ఇప్పటికిప్పుడు చిరంజీవి సరసన నటించే భామ దొరకడం అంటే కష్టం అని తెలుసుకొని కాజల్ అంత అమౌంట్ అడిగింది. "భారతీయుడు 2"లో కమల్ హాసన్ సరసన నటిస్తున్న కాజల్ కెరీర్ అంత బ్రైట్ గా ఏమి సాగడం లేదు. అఫర్ రాగానే ఒప్పుకోవాలి. కానీ రెండున్నర అడిగింది అంట. 

ఐతే రామ్ చరణ్ రంగంలోకి దిగి ఆమెని ఒప్పించాడనేది టాక్. చివరికి కోటిన్నర రూపాయల పారితోషికానికి ఒప్పుకొంది కాజల్. ఇప్పటికే "ఖైదీ నెంబర్ 150" సినిమాలో మెగాస్టార్ తో అమ్మడు కుమ్ముడు అంటూ సూపర్ స్టెప్పులు వేసిన కాజల్ ఆయనతో రెండో సారి జతగా నటించనుంది. కాజల్ కి ఇప్పుడు 33. దాదాపు 14 ఏళ్లుగా నటిస్తోంది. ఇప్పటికి హీరోయిన్ గా అవకాశాలు పొందడం గ్రేటే.