ఇంత‌కీ కాజ‌ల్ ఎక్క‌డుంది?

Kajal asks followers to find her
Saturday, February 9, 2019 - 13:00

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ మరో వైరల్ పిక్ రిలీజ్ చేసింది. రోజూ తనకు సంబంధించిన ఏదో ఒక స్టిల్ రిలీజ్ చేసి అభిమానులను ఊరించే ఈ ముద్దుగుమ్మ, ఈసారి మాత్రం ఓ పజిల్ వదిలింది. తన చిన్నప్పుడు స్కూల్ లో దిగిన గ్రూప్ ఫొటో వదిలింది.

చిన్నప్పటి రోజులు చాలా బాగున్నాయంటూ చెప్పుకొస్తూనే, తను ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దామంటూ ఓ పజిల్ వదిలింది. దాదాపు 30 మందితో దిగిన గ్రూప్ ఫొటో అది. అందరూ అమ్మాయిలే. కానీ అందులోంచి కాజల్ ను వెదికి పట్టుకోవడం నెటిజన్లకు చాలా ఈజీ అయింది. అంతలా గ్రూప్ ఫొటోలో ధగధగలాడిపోతోంది కాజల్. పేరుకు అది బ్లాక్ వైట్ ఫొటోనే అయినప్పటికీ కాజల్ ను మాత్రం ఈజీగానే గుర్తుపట్టేయొచ్చు. కావాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి.