సినిమా వాడిని పెళ్లి చేసుకోను: కాజ‌ల్‌

Kajal says she will not marry a movie person
Wednesday, January 23, 2019 - 12:15

32 ఏళ్ల కాజ‌ల్ అగ‌ర్వాల్ ఎప్ప‌టిక‌పుడు త‌న పెళ్లిని వాయిదా వేస్తోంది. తాజాగా మ‌రోసారి ఆమె పెళ్లి పుకార్లు షికార్లు చేస్తుండ‌డంతో ఈ భామ వెడ్డింగ్ గురించి మీడియాతో మాట్లాడింది. ఇపుడిపుడే పెళ్లి లేద‌ట‌. తాను మేరేజ్ చేసుకోబోతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల్లో ఇసుమంత కూడా నిజం లేదంటోంది.

అలాగే తాను ఎవ‌ర్నీ ప్రేమించ‌డం లేద‌నీ, ఏ హీరోతో డేటింగ్‌లో లేన‌ని కూడా తేల్చి చెప్పింది. ఒక త‌మిళ హీరోతో ఈ అమ్మ‌డు బాగా డీప్‌గా డేటింగ్ చేస్తోంద‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐతే ఈ భామ మాత్రం అదంతా అబ‌ద్ద‌మంటోంది. ఆ మాట‌కొస్తే.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోనని అంటోంది.

ఎవ‌ర్నీ పెళ్లి చేసుకుంటాను అనేది నాకే తెలియ‌దు. ఐతే చిత్ర పరిశ్రమకు చెందిన వారిని మాత్రం చేసుకోనని బాంబు పేల్చింది. ఇండ‌స్ట్రీలో బ్యాచిల‌ర్ హీరోలు, డైర‌క‌ర్ట్స్ అంతా ఆమెకి మంచి స్నేహితులంట‌. ఆ ఫ్రెండ్స్‌లో ఎవ‌ర్నీ జీవిత భాగస్వామిగా ఊహించుకోలేన‌ని అంటోంది. గ‌తంలో కాజ‌ల్ ఒక బ‌డా తెలుగు హీరోతో సీరియ‌స్ రిలేష‌న్‌షిప్ కొన‌సాగించింది. వీరి బంధం పెళ్లి వ‌ర‌కు వెళ్లింది కానీ ఆ త‌ర్వాత ఇద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పుకున్నారు.

ప్రస్తుతం ఆమె ‘భారతీయుడు 2’ చిత్రంతో బిజీగా ఉంది. ఇందులో క‌మ‌ల్ భార్య‌గా న‌టిస్తోంది కాజ‌ల్‌.