రజినీతో నటించాలి

Kajal's dream
Thursday, October 17, 2019 - 08:00

సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటిస్తే తన కల నెరవేరినట్లే అని అంటోంది కాజల్ అగర్వాల్. "మెగాస్టార్ చిరంజీవి వంటి లెజెండరీ నటుడితో నటించాను. త్వరలో గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ సరసన భారతీయుడు 2లో నటిస్తున్నాను. ఇక సూపర్ స్టార్ తో నటిస్తే చాలు...." ఇలా చెప్పుకొచ్చింది కాజల్. ఇటీవల కాజల్ కి వరుసగా అపజయాలు తగిలాయి. రణరంగం, సీత, కవచం... ఇలా అన్ని ఫ్లాపులే.

ఇప్పుడు భారతీయుడు 2లో అవకాశం రావడం బూస్ట్. 

కాజల్ ఇప్పటికే 13 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకోంది. ఇప్పుడు తెలుగు లో కొత్తగా పెద్ద ఆఫర్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు కానీ 'అ' దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసే కొత్త సినిమాలో ఆమె నటించనుందట.